
బెంగుళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాష్ట్ర విధాన సౌధలో ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు. ప్రస్తుతం స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ కార్యాలయంగా ఉన్న రెండు గదులను సిద్ధరామయ్యకు కుమారస్వామి ప్రభుత్వం కేటాయించింది. సిద్ధరామయ్యకు ఎలాంటి పదవీ లేనప్పటికి ఆయనకు కార్యాలయాన్ని కేటాయించారు. అయితే మాజీ సీఎం కోసం స్పీకర్‌ను ఖాళీ చేయించడం ఏంటని హాట్ టాపిక్‌గా మారింది. కాగా మాజీ స్పీకర్ కేబీ కోలివాడ్ ఆ కార్యాలయాన్ని వినియోగించిన కాలంలో 68 లక్షల ఖర్చుతో దాన్ని ఆధునీకరించారు. కాంగ్రెస్ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రిగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో సిద్ధరామయ్యకు ఎలాంటి మంత్రి పదవి కేటాయించలేదన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment