Vijay Sethupathi To Play Karnataka CM Siddaramaiah Biopic - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: ముఖ్యమంత్రిపై సినిమా.. విజయ్‌కి లక్కీ ఛాన్స్

Published Wed, Aug 2 2023 10:01 AM | Last Updated on Wed, Aug 2 2023 10:52 AM

Vijay Sethupathi In Karnataka CM Siddaramaiah Biopic - Sakshi

విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వెర్సటైల్ యాక్టర్ అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోగా మాత్రమే చేస్తా, లేదంటే లేదు అని మడికట్టుకుని కూర్చోలేదు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గెస్ట్ రోల్.. ఇలా తనకు నచ్చిన ప్రతిదీ చేసుకుని పోయాడు. పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల్ని సంపాదించుకుంటున్నాడు. అలాంటి ఈ నటుడు ఇప్పుడు ఏకంగా సీఎం బయోపిక్‪‌లో ఛాన్స్ కొట్టేశాడట.

సీఎం బయోపిక్ అనగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఎందుకంటే 'యాత్ర 2'లో ముఖ్యమంత్రి పాత్ర కోసం తమిళ నటుడు జీవా పేరు పరిశీలనలో ఉంది. బయటకు చెప్పట్లేదు కానీ దాదాపు ఇదే కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇక విజయ్ సేతుపతి చేయబోయేది కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బయోపిక్‌లో అని టాక్.

(ఇదీ చదవండి: సమంత ట్రీట్‌మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?)

ఓ సామాన్యుడిలా మొదలైన సిద్ధరామయ్య ప్రయాణం.. ముఖ్యమంత్రి పీఠం వరకు ఎలా చేరింది అనేది రెండు భాగాల సినిమాగా తీయనున్నారు. అయితే హీరోగా దక్షిణాది నటుల్లో చాలామంది పేర‍్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యాడట. లాయర్, రాజకీయ జీవితంతోపాటు సిద్ధరామయ్య బ్రేకప్ స్టోరీ కూడా ఇందులో చూపించబోతున్నారట.

ఈ బయోపిక్‌ని ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే విధంగా తీయబోతున్నారట. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ చిత్రానికి 'లీడర్ రామయ్య' పేరు ఖరారు చేశారు. కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళంలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన 'జవాన్' వచ్చే నెలలో రిలీజ్ కానుంది. హిందీలో ఒకటి, తమిళంలో ఐదు సినిమాల్లో హీరోగా నటిస్తూ విజయ్ బిజీగా ఉన్నాడు.

(ఇదీ చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement