![CM yeddyurappa Wish to Siddaramaiah in Hospital - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2019/12/13/yaddi.jpg.webp?itok=5xovImaH)
సాక్షి బెంగళూరు: నిత్యం రాజకీయంగా కత్తులు దూసుకునే నాయకులు కలిశారు. మాజీ సీఎం సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి యడియూరప్ప పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతూ యాంజియోప్లాస్టీ ఆపరేషన్ చేయించుకున్న సిద్ధరామయ్య ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి యడియూరప్ప, గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, హోం మంత్రి బసవరాజు బొమ్మాయి తదితరులు సిద్ధరామయ్యను పరామర్శించారు. ‘నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎలాంటి సమస్య లేదు. శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం మామూలుగానే ఉన్నాను’ అని సిద్దరామయ్య తెలిపారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు సూచించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment