కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు, తెలంగాణలో సైతం ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. కాగా, రాగల మూడు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇందులో భాగంగా, శుక్రవారం వరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు.. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొమురంభీమ్ ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 29, 2022
Comments
Please login to add a commentAdd a comment