సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యాయి. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని యెల్లో అలెర్ట్ ద్వారా వాతావరణ శాఖ తెలిపింది.
సిద్దిపేట
రంగారెడ్డి
వికారాబాద్
సంగారెడ్డి
మెదక్
కామారెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యాయ్యి.
ద్రోణి ప్రభావంతో.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్ల వానకు సైతం ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే.. మిగతా ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చని, హైదరాబాద్‌లో మాత్రం 34-38 మధ్య నమోదు కావొచ్చని తెలిపింది. హైదరాబాద్‌లోనూ వర్ష ప్రభావం ఉండొచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment