మార్కెట్లో 'ఐఫోన్స్'కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఇందులో కస్టమర్లు ఆధునిక ఫీచర్స్ ఉన్న వాటిని మాత్రమే కాకుండా, లేటెస్ట్ కలర్ ఆప్షన్ కూడా ఎంపిక చేసుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మొబైళ్లను కొత్త ఎల్లో కలర్ ఆప్షన్‌లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
ఇప్పటి వరకు పింక్, వైట్, గ్రే మొదలైన కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఐఫోన్స్ రానున్న రోజుల్లో 'ఎల్లో' ఆప్షన్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 14 సిరీస్ నయా కలర్ పొందుతున్నట్లు జపాన్‍కు చెందిన బ్లాగ్ మ్యాక్ఒటాకర వెల్లడించింది.
(ఇదీ చదవండి: సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్: కేవలం 300 మందికి మాత్రమే!)
గతంలో ఎల్లో కలర్ అనేది ఐఫోన్ 11 సిరీస్‍లో ఉండేది. అయితే నాలుగేళ్ల తరువాత కంపెనీ మళ్ళీ ఐఫోన్ 14లో ఈ కలర్ తీసుకురావాలని సంకల్పించింది. అయితే ఈ కొత్త కలర్ ప్రొడక్ట్ ప్లానింగ్ వచ్చే వారంలో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఐఫోన్ 13కి గ్రీన్ కలర్ అందించింది.
నిజానికి యాపిల్ కంపెనీ సెప్టెంబర్ నెలలో కొత్త సిరీస్ మొబైల్స్ లాంచ్ చేస్తుంది. ఆ తరువాత సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఆ సిరీస్‍లో కొత్త కలర్ వేరియంట్లను ప్రవేశపెడుతుంటుంది. 2022 మార్చిలో కంపెనీ ఐఫోన్ 13 సిరీస్‍కు గ్రీన్ కలర్, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ ఫోన్‍లకు 2021 ఏప్రిల్‍లో పర్పుల్ కలర్ ఆప్షన్ అందించింది. కొనుగోలుదారులను ఆకర్శించడానికి కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కలర్స్ విడుదల చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment