
పసుపు
పసుపులోని కర్కుమిన్ పదార్థం జ్ఞాపకశక్తిని పెంచేందుకు మాత్రమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు దోహదపడుతుందని అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు. మతిమరుపు లేని... ఈ లక్షణాలతో కూడిన వ్యాధి అయిన అల్జైమర్స్ రోగులపై జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ అంచనాలకు రాగలిగామని శాస్త్రవేత్తలు చెప్పారు. భారతీయుల్లో అల్జైమర్స్ వ్యాధిగ్రస్తులు తక్కువగా ఉండేందుకు పసుపు వాడకం ఒక కారణం కావచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ గారీ స్మాల్ తెలిపారు. పరిశోధనల్లో భాగంగా తాము 50 –90 ఏళ్ల మధ్య వయసువారికి రోజూ 90 మిల్లీగ్రాముల కర్కుమిన్ రెండు సార్లు ఇచ్చామని.. కొందరికి ఉత్తుత్తి మాత్రలు ఇచ్చామని చెప్పారు.
దాదాపు 18 నెలలపాటు కర్కుమిన్ అందించిన తరువాత వారి మెదడు పనితీరుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించామని.. ఆ తరువాత ఆరు నెలలకు ఒకసారి ఇవే పరీక్షలు నిర్వహించామని వివరించారు. ఫలితాలను పరిశీలించినప్పుడు కర్కుమిన్ తీసుకున్న వారి జ్ఞాపకశక్తి పెరిగినట్లు.. ఉత్తుత్తి మాత్రలు తీసుకున్న వారిలో లేనట్లు తెలిసిందని అన్నారు. అంతేకాకుండా కర్కుమిన్ తీసుకన్న వారి మూడ్‌లోనూ ఎన్నో సానుకూల మార్పులు కనిపించాయని చెప్పారు. మరింత విస్త్తృత స్థాయి పరిశోధనలు నిర్వహించడం ద్వారా ఈ ఫలితాలను ధ్రువీకరించుకుంటే.. జ్ఞాపకశక్తిని పెంచేందుకు పసుపు ఓ మంచి ఆయుధం కాగలదన్నమాట!
Comments
Please login to add a commentAdd a comment