పెను భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్ శిథిలాల నుంచి చనిపోయిన వారి మృతదేహాలే కాదు.. కొన ఊపిరితో ఉన్నవారు కూడా బయటపడుతున్నారు.
కఠ్మాండు: పెను భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్ శిథిలాల నుంచి చనిపోయిన వారి మృతదేహాలే కాదు.. కొన ఊపిరితో ఉన్నవారు కూడా బయటపడుతున్నారు. దాదాపు ఐదు రోజులు గడిచిన తర్వాత భారీ శిథిలాల కిందనుంచి గురువారం ఓ పద్దెనిమిదేళ్ల యువకుడిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. పెంబా తమాంగ్ అనే యువకుడు భూకంపం వచ్చిన సమయంలో కూలిపోయిన తొమ్మిది అంతస్థుల భవనం కింద పడిపోయాడు.
భవనం కూలిన సమయంలో ఓ బైక్ను ఆసరాగా చేసుకొని దానికింద ఐదురోజులుగా ప్రాణాలు నిలుపుకున్నాడు. రోజువారిగా సహాయక చర్యలు చేపడుతున్నసిబ్బందికి దాహం దాహం అంటూ అతడి కేకలు వినిపించడంతో దాదాపు ఐదుగంటలపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అతడికి అక్కడక్కడా గాయాలయ్యాయి.