న్యూఢిల్లీ: దేశంలో వారం రోజులుగా ఎండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రానున్న అయిదు రోజుల్లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వడగాలులు వీసేందుకు అవకాశాలు లేవని అంచనా వేసింది.
తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మొత్తమ్మీద ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, యూపీ, పంజాబ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వాన కురుస్తుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది.
(మువ్వన్నెల జెండాకు అవమానం.. చికెన్ శుభ్రం.. వీడియో వైరల్.. అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment