Cloudy sky
-
చల్లని కబురు.. 5 రోజులు ఎండల నుంచి ఉపశమనం: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశంలో వారం రోజులుగా ఎండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రానున్న అయిదు రోజుల్లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వడగాలులు వీసేందుకు అవకాశాలు లేవని అంచనా వేసింది. తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మొత్తమ్మీద ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, యూపీ, పంజాబ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వాన కురుస్తుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. (మువ్వన్నెల జెండాకు అవమానం.. చికెన్ శుభ్రం.. వీడియో వైరల్.. అరెస్ట్) -
బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం: ప్రతికూల వాతావరణమే కారణం
న్యూఢిల్లీ: మేఘావృతమైన ప్రతికూల వాతావరణంలోకి హఠాత్తుగా హెలికాప్టర్ ప్రవేశించడంతో.. అది పైలట్ అధీనంలో ఉన్నప్పటికీ దాని పథం మారి కిందకు దూసుకొచ్చి కూలిందని సీడీఎస్ రావత్ ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో వెల్లడైన ప్రాథమిక వివరాలు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి చేరాయని భారత వాయుసేన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ముందుస్తు కుట్ర, ఉగ్రవాద దుశ్చర్చ, హెలికాప్టర్లో లోపాలు, పైలట్ తప్పిదం.. ఇలాంటి వాదనలు అన్నీ అవాస్తవం’ అని స్పష్టంచేసింది. చదవండి: కోడలి నగలు భద్రపరచడం క్రూరత్వం కాదు ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైన సమాచారంతోపాటు ఘటనాస్థలిలో సేకరించిన సమాచారాన్ని పరిశీలించి ప్రాథమిక అంచనాకు వచ్చారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికసహా 14 మంది ప్రయాణిస్తున్న భారత వాయుసేన హెలికాప్టర్ గత ఏడాది డిసెంబర్ ఎనిమిదిన కూనూర్‌లో నీలగిరి కొండల్లో నేలకూలిన విషయం తెల్సిందే. -
ముంబైలో తేలికపాటి జల్లులు
ముంబై: దేశ ఆర్థిక రాజధానిని వరుణుడు కరుణించడం లేదు. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ముంబైతో పాటు థానె, కళ్యాణ్, దోంబివాల వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవారం ఉదయం తేలికపాటి జల్లులు కురిశాయి. పొగమంచు కప్పేయడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. పరిసరాలు సరిగా కనిపించడం లేదు. ఈ సందర్భంగా ప్రాంతీయ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేఎస్ హోసాలికర్ మాట్లాడుతూ.. ‘ముంబై, థానె, నవీ ముంబై ప్రాంతాల్లో గడిచిన ఆరు గంటల నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఇక రానున్న మూడు, నాలుగు గంటల్లో ఈ ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది’ అని తెలిపారు. ఇక మరో 24 గంటల పాటు ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని తెలిపారు. ఇక వాతావరణ శాఖ ప్రకారం మరో 48 గంటల పాటు ముంబై, పరిసర ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతం అయి ఉంటుందని.. ఉష్ణోగ్రత 22 డిగ్రీలకు పడి పోతుందని వెల్లడించింది. ముంబై వాతావరణ పరిస్థితులకు సంబంధించి పలువురు నెటిజన్లు ఫోటోలు షేర్ చేస్తున్నారు. Dip in temperatures with smog shrouding parts of Mumbai city and Thane leading to decreased visibility. According to the forecast, it is likely to be cloudy with the minimum temperature at 23 to 22 degrees celsius for next 48 hours#Mumbairains #December #rains #thane #birds pic.twitter.com/quQXw3OJ2Z — Pratik Mukane | प्रतिक मुकणे (@pratikmukane) December 14, 2020 -
మీరు చూడని జీవితం
అదే రైలులో వారి బోగీలో పక్కసీట్లో ప్రయాణిస్తున్నఒక జంటకు ఈ యువకుడి తీరు విడ్డూరంగా కనబడింది. చెట్లనూ, మేఘాలనూ చూసి ఆనందించే పిల్లాడి వయసైతే నిశ్చయంగా కాదు. రైలు వేగంగా వెళ్తోంది. అంతకంటే వేగంగా తోవ పక్కనున్న చెట్లూ, దూరంగా గడ్డి మేస్తున్న మేకలూ, అక్కడక్కడా నిండివున్న చెరువులూ వెనక్కి వెళ్లిపోతున్నాయి. కిటికీలోంచి వాటిని ఉద్విగ్నంగా చూస్తున్న ఒక యువకుడు, ‘నాన్నా, ఆకుపచ్చని చెట్లు వెనక్కి పరుగెడుతున్నాయి’ అన్నాడు. వాళ్ల నాన్న సంతోషంతో చిరునవ్వు నవ్వాడు.‘నాన్నా, చూశావా? పైన మేఘాలు మనతో పాటు వస్తున్నాయి’ మళ్లీ ఆనందంతో అరిచినట్టుగా అన్నాడు యువకుడు. వాళ్ల నాన్న ఆకాశం వైపు ఓసారి ముఖాన్ని పెట్టి, మళ్లీ కొడుకు సంతోషపు ముఖాన్ని తృప్తిగా చూశాడు. అదే రైలులో వారి బోగీలో పక్కసీట్లో ప్రయాణిస్తున్న ఒక జంటకు ఈ యువకుడి తీరు విడ్డూరంగా కనబడింది. చెట్లనూ, మేఘాలనూ చూసి ఆనందించే పిల్లాడి వయసైతే నిశ్చయంగా కాదు.‘నాన్నా, అటు చూడు...’ అని ఒక వైపు దూరంగా చేయిని చూపిస్తూ, తన సంతోషాన్ని ఆపుకోలేక మళ్లీ నాన్నను పిలిచాడు యువకుడు. ఇక ఈ చేష్టతో ఆ జంటకు చిర్రెత్తిపోయింది. అందులో భర్త యువకుడి నాన్నను ఉద్దేశించి, ‘సర్, నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మీ అబ్బాయి అలా పిల్లాడిలా ప్రవర్తించడమూ, మీరు దానికి వంతపాడటమూ చూడ్డానికి కొంత ఇబ్బందిగా ఉంది. అతణ్ని మంచి డాక్టర్‌కు చూపించకపోయారా?’ అన్నాడు. అలా అన్నందుకు ఆ తండ్రి వారిని ఇంతైనా తప్పు పట్టకుండా చెప్పాడు: ‘హాస్పిటల్ నుంచే వస్తున్నాం సర్. వాడికి పుట్టుకనుంచే చూపు తక్కువ. ఇవ్వాళే కొత్త కళ్లు వచ్చాయి’. -
మబ్బే మసకేసిందిలే...
హైదరాబాద్: అసలే ఆదివారం ఆపై ఆకాశం మబ్బులు కమ్మేయడంతో భాగ్యనగర వాసులు ముసుగుతన్నారు. నిన్నామొన్నటి వరకు ఉక్కపోతలతో అల్లాడిన హైదరాబాదీలు వాతావరణం చల్లబడడంతో సేదతీరారు. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో భాగ్యనగరం అంతా కాస్త చీకటి అలముకుంది. సూర్యుడు మబ్బులు చాటున దాక్కోవడంతో ఉదయం 10 గంటలైనా వెలుతురు జాడే లేదు. సెలవు రోజు కూడా కావడంతో భాగ్యనగర వాసులు మంచం దిగేందుకు ఇష్టపడలేదు. ఆదివారం రోజున ఆలస్యంగా నిద్రలేచే హైదరాబాదీలు ఈరోజు మరింత బద్దకించారు. చిరుజల్లులతో వాతావరణం చల్లగా ఉండడంతో మరింతగా మంచానికి అతుక్కుపోయారు. అత్యవసర పనులు, పెళ్లిపేరంటాలు ఉన్నవారు మంచం దిగక తప్పలేదు.