అదే రైలులో వారి బోగీలో పక్కసీట్లో ప్రయాణిస్తున్నఒక జంటకు ఈ యువకుడి తీరు విడ్డూరంగా కనబడింది. చెట్లనూ, మేఘాలనూ చూసి ఆనందించే పిల్లాడి వయసైతే నిశ్చయంగా కాదు.
రైలు వేగంగా వెళ్తోంది. అంతకంటే వేగంగా తోవ పక్కనున్న చెట్లూ, దూరంగా గడ్డి మేస్తున్న మేకలూ, అక్కడక్కడా నిండివున్న చెరువులూ వెనక్కి వెళ్లిపోతున్నాయి. కిటికీలోంచి వాటిని ఉద్విగ్నంగా చూస్తున్న ఒక యువకుడు, ‘నాన్నా, ఆకుపచ్చని చెట్లు వెనక్కి పరుగెడుతున్నాయి’ అన్నాడు. వాళ్ల నాన్న సంతోషంతో చిరునవ్వు నవ్వాడు.‘నాన్నా, చూశావా? పైన మేఘాలు మనతో పాటు వస్తున్నాయి’ మళ్లీ ఆనందంతో అరిచినట్టుగా అన్నాడు యువకుడు. వాళ్ల నాన్న ఆకాశం వైపు ఓసారి ముఖాన్ని పెట్టి, మళ్లీ కొడుకు సంతోషపు ముఖాన్ని తృప్తిగా చూశాడు.
అదే రైలులో వారి బోగీలో పక్కసీట్లో ప్రయాణిస్తున్న ఒక జంటకు ఈ యువకుడి తీరు విడ్డూరంగా కనబడింది. చెట్లనూ, మేఘాలనూ చూసి ఆనందించే పిల్లాడి వయసైతే నిశ్చయంగా కాదు.‘నాన్నా, అటు చూడు...’ అని ఒక వైపు దూరంగా చేయిని చూపిస్తూ, తన సంతోషాన్ని ఆపుకోలేక మళ్లీ నాన్నను పిలిచాడు యువకుడు. ఇక ఈ చేష్టతో ఆ జంటకు చిర్రెత్తిపోయింది. అందులో భర్త యువకుడి నాన్నను ఉద్దేశించి, ‘సర్, నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మీ అబ్బాయి అలా పిల్లాడిలా ప్రవర్తించడమూ, మీరు దానికి వంతపాడటమూ చూడ్డానికి కొంత ఇబ్బందిగా ఉంది. అతణ్ని మంచి డాక్టర్‌కు చూపించకపోయారా?’ అన్నాడు. అలా అన్నందుకు ఆ తండ్రి వారిని ఇంతైనా తప్పు పట్టకుండా చెప్పాడు: ‘హాస్పిటల్ నుంచే వస్తున్నాం సర్. వాడికి పుట్టుకనుంచే చూపు తక్కువ. ఇవ్వాళే కొత్త కళ్లు వచ్చాయి’.
మీరు చూడని జీవితం
Published Mon, Mar 19 2018 12:16 AM | Last Updated on Mon, Mar 19 2018 12:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment