మబ్బే మసకేసిందిలే... | Cloudy sky in Hyderabad | Sakshi
Sakshi News home page

మబ్బే మసకేసిందిలే...

Published Sun, Jun 7 2015 9:56 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

మబ్బే మసకేసిందిలే... - Sakshi

మబ్బే మసకేసిందిలే...

హైదరాబాద్: అసలే ఆదివారం ఆపై ఆకాశం మబ్బులు కమ్మేయడంతో భాగ్యనగర వాసులు ముసుగుతన్నారు. నిన్నామొన్నటి వరకు ఉక్కపోతలతో అల్లాడిన హైదరాబాదీలు వాతావరణం చల్లబడడంతో సేదతీరారు. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో భాగ్యనగరం అంతా కాస్త చీకటి అలముకుంది.

సూర్యుడు మబ్బులు చాటున దాక్కోవడంతో ఉదయం 10 గంటలైనా వెలుతురు జాడే లేదు. సెలవు రోజు కూడా కావడంతో భాగ్యనగర వాసులు మంచం దిగేందుకు ఇష్టపడలేదు. ఆదివారం రోజున ఆలస్యంగా నిద్రలేచే హైదరాబాదీలు ఈరోజు మరింత బద్దకించారు. చిరుజల్లులతో వాతావరణం చల్లగా ఉండడంతో మరింతగా మంచానికి అతుక్కుపోయారు. అత్యవసర పనులు, పెళ్లిపేరంటాలు ఉన్నవారు మంచం దిగక తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement