సాక్షి, మంచిర్యాల: డీజీపీ మహేందర్‌రెడ్డి కుమురం భీం జిల్లా పర్యటన ఆదివారం ముగిసింది. ఈ నెల 2న మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్ చేరుకున్న డీజీపీ ఆదివారం వరకు అక్కడే గడిపారు. నెలన్నర వ్యవధిలో రెండుసార్లు ఆసిఫాబాద్ వచ్చిన డీజీపీ.. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులు, పోలీసుల పనితీరును నేరుగా తెలు సుకున్నట్లు తెలుస్తోంది. దళ సభ్యుల సం చారం నేపథ్యంలో అప్రమత్తతపై మరో మారు స్థానిక పోలీసులకు దిశానిర్దేశం చేసినట్లుగా పర్యటన సాగింది. ఉమ్మడి జిల్లాలో నక్సల్స్ సానుభూతిపరులు, కూంబింగ్‌లో బలగాలు వ్యవహరించాల్సిన తీరు, కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు వంటివి చర్చకు వచ్చి నట్లు సమాచారం. మావోయిస్టులను ఆదిలో నిలువరించేందుకు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. గత ఐదు రోజులుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ప్రాణహిత తీరం, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది.
అత్యంత గోప్యంగా పర్యటన
డీజీపీ ఆసిఫాబాద్ పర్యటన గోప్యంగా సాగింది. ఈ ఐదు రోజుల్లో ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు. తొలి రోజు హెలికాఫ్టర్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మావోయిస్టు సంచారం ఉన్న అటవీ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రెండు రోజులపాటు జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీసులోనే రామగుండం పోలీసు కమిషనర్, ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ, ఓఎస్డీ ఉదయ్‌కుమార్ రెడ్డి, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణువారియర్‌తో సమీక్షలు నిర్వహించారు. ఈ నెల 4న రాత్రి పది గంటలకు మారుమూల తిర్యాణి పోలీస్‌స్టేషన్‌కు రోడ్డు మార్గాన వెళ్లి వచ్చారు.
గత జూలైలో ఈ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంగీ అడవుల్లో మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఫైరింగ్ జరిగింది. రెండు సార్లు దళ సభ్యులు చిక్కినట్లే చిక్కి తృటిలో తప్పించుకున్నారు. అలాంటి మారు మూల ప్రాంతానికి డీజీపీ రాత్రి వెళ్లడంతో ఏదో జరుగుతోందని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అదే రాత్రి డీజీపీ ఆసిఫాబాద్ చేరుకున్నారు. ఈనెల 5న ఎస్పీ క్యాంపు ఆఫీ సులో ఉమ్మడి జిల్లాలోని మావోయిస్టు ప్ర భా వం ఉన్న ఎస్సై, సీఐ, డీఎస్పీలతో సుదీర్ఘంగా సమీక్షించారు. అదేరోజు చివరగా కుమురం భీం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో ప్రత్యేకం గా సమావేశమయ్యారు. ఐదో రోజు మధ్యా హ్నం 3 గంటలకు రోడ్డు మార్గాన ఆసిఫాబా ద్ నుంచి హైదరాబాద్ బయలుదేరివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment