Axis Bank shares
-
రాబడుల్లో మేటి పనితీరు
ఈక్విటీ ఇన్వెస్టర్లకు గడిచిన ఏడాది, రెండేళ్లు పరీక్షా కాలం వంటిది. ఎన్నో అనిశ్చితులు, ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సూచీల్లో పెరుగుదల ఉన్నా కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు రాబడులు పొందిందీ లేదు. కొందరు నష్టాలు కూడా చవిచూశారు. మార్కెట్ అంతటా పెరుగుదల లేకపోవడమే దీనికి కారణం. కేవలం కొన్ని కంపెనీలే మార్కెట్ పెరుగుదలకు దోహదపడ్డాయి. అందుకే అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్ లీడర్లుగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం తెలివైన వ్యూహం అవుతుంది. కనుక భిన్న మార్కెట్ పరిస్థితుల్లో అద్భుత పనితీరు చూపించిన లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలనేది మా సూచన. యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విధానం యాక్సిస్ బ్లూచిప్ అన్నది లార్జ్‌క్యాప్ ఫండ్. మంచి వ్యాపార నాణ్యత కలిగిన లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. పోర్ట్‌ఫోలియో పరంగా వైవిధ్యాన్ని కూడా గమనించొచ్చు. 2016 నవంబర్ నుంచి ఈ పథకాన్ని శ్రేయాష్ దేవల్కర్ నిర్వహిస్తున్నారు. బోటమ్ అప్ విధానంలో స్టాక్స్‌ను, ఫండమెంటల్స్(వ్యాపార మూలాలు), వృద్ధి అవకాశాలు, ఆయా కంపెనీలకు పోటీ పరంగా ఉన్న అనుకూలతలు వంటి అంశాల ఆధారంగా ఈ పథకం పెట్టుబడుల కోసం ఎంపిక చేసుకుంటుంది. పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 80–100% వరకు అధిక నాణ్యత కలిగిన పెద్ద కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్‌క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని స్తాయి. వ్యాపార కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండడం, నిధుల వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక మందగమన ప్రభావం వీటిపై తక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం ఫైనాన్షియల్, టెక్నాలజీ స్టాక్స్‌లో ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రెండు రంగాల స్టాక్స్‌లో వరుసగా 45%, 14% చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. రాబడుల పనితీరు ఈ పథకం నిర్వహణలో సెప్టెంబర్ నాటికి రూ.8,050 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రాబడులకు సంబంధించి మంచి చరిత్ర ఉంది. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 15.95 శాతం రాబడులిచ్చింది. ఐదేళ్లలో.. వార్షిక పనితీరు 12.30%. కానీ, ఇదే కాలంలో పోటీ పథకాలు ఇచ్చిన రాబడులు మూడేళ్లలో 10.57%, ఐదేళ్లలో 9.26%గానే ఉన్నాయి. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ప్రతీ నెలా రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే 2019 సెప్టెంబర్30 నాటికి రూ.11.9 లక్షల సంపద సమకూరేది. ఇందులో అసలు పెట్టుబడి రూ.5.8 లక్షలు. ఈ పథకంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీసం రూ.5,000 నుంచి..; సిప్ రూపంలో అయితే ప్రతీ నెలా కనీసం రూ.500 మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ రూపంలో కనీసం ఆరు నెలల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం, దీర్ఘకాలంలో సంపద సమకూర్చుకోవాలనుకునే వారు కనీసం ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
యాక్సిస్ బ్యాంక్
ముంబై: ప్రైవేట్ రంగంలో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్ యాక్సిస్.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 1,842 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది అంత క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4తో పోలిస్తే 18 శాతం అధికం. అప్పట్లో దాదాపు రూ. 9,055 కోట్ల ఆదాయంపై రూ. 1,555 కోట్ల లాభం ఆర్జించింది. తాజా క్యూ4లో ఆదాయం రూ. 10,179 కోట్లకు పెరిగింది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. నికర వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ. 2,665 కోట్ల నుంచి రూ. 3,166 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్(నిమ్) సైతం 3.70 శాతం నుంచి 3.89%కి పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను 200% మేర(రూ.20) డివిడెండ్ ఇవ్వాలని యాక్సిస్ బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 180 శాతం (రూ. 18) డివిడెండ్ ఇచ్చింది. మరోవైపు, బ్యాంక్ బోర్డు.. షేర్ల విభజన ప్రతిపాదనను ఆమోదించింది. దీని ప్రకారం రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ. 2 ముఖ విలువ గల 5 షేర్ల కింద విభజిస్తారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను .. యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 20 శాతం ఎగిసింది. రూ. 5,179 కోట్ల నుంచి సుమారు రూ. 6,218 కోట్లకు పెరిగింది. తొలిసారిగా బిలియన్ డాలర్ల మేర నికర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ. 33,734 కోట్ల నుంచి రూ. 38,046 కోట్లకు పెరిగింది. బాసెల్ త్రీ నిబంధనల ప్రకారం మార్చి ఆఖరు నాటికి మూలధన నిష్పత్తి (సీఏఆర్) 16.07 శాతంగా ఉన్నట్లు బ్యాంక్ వివరించింది. నికర వడ్డీ ఆదాయం, ఫీజుల కారణంగా లాభాలు గణనీయంగా పెరిగాయని యాక్సిస్ ఈడీ సోమ్‌నాథ్ సేన్‌గుప్తా వివరించారు. రియల్టీ, కార్లు.. వాణిజ్య వాహన రుణాల విభాగాల్లో పనితీరు కొంత మందకొడిగా ఉందని, అయితే సెంటిమెంట్ కొంతైనా మెరుగుపడితే పరిస్థితుల్లో మార్పు రాగలదని తెలిపారు. 1.22 శాతానికి స్థూల ఎన్పీఏలు.. బ్యాంక్ ఇచ్చిన రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 1.22%కి పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 1.06 శాతంగా ఉన్నాయి. అటు నికర ఎన్పీఏలు సైతం 0.32% నుంచి 0.40%కి పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ షేర్ల ధర బీఎస్ఈలో సుమారు 1.10 శాతం పెరిగి రూ. 1,534.45 వద్ద ముగిసింది. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ. 1,604 కోట్లు
ముంబై: యాక్సిస్ బ్యాంక్ క్యూ3లో రూ. 1,604 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఇదే కాలం(అక్టోబర్-డిసెంబర్’12)లో ఆర్జించిన రూ. 1,347 కోట్లతో పోలిస్తే ఇది 19% వృద్ధి. ఇదే కాలానికి ఆదాయం కూడా రూ. 8,580 కోట్ల నుంచి రూ. 9,434 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయంలో వృద్ధి, మెరుగుపడ్డ మార్జిన్లు, ప్రొవిజన్లు తగ్గడం వంటి అంశాలు మెరుగైన పనితీరుకు దోహదపడినట్లు బ్యాంకు ఈడీ సోమనాథ్ సేన్‌గుప్తా పేర్కొన్నారు. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 20% పుంజుకుని రూ. 2,984 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3.57% నుంచి 3.71%కు మెరుగయ్యాయి. కాగా, ప్రొవిజన్ల కింద రూ. 202 కోట్లను కేటాయించింది. 2% అధికంగా రూ. 1,644 కోట్ల ఇతర ఆదాయం నమోదుకాగా, ఫీజు ఆదాయం 4% పెరిగి రూ. 1,456 కోట్లకు చేరింది.బీఎస్ఈలో బ్యాంకు షేరు గురువారం స్వల్పంగా నష్టపోయి రూ. 1,177 వద్ద ముగిసింది.