అమెరికాలో మనోళ్లు భేష్‌! | Average Income Indians Emong Those Settling In America Is Higher Than All | Sakshi
Sakshi News home page

అమెరికాలో మనోళ్లు భేష్‌!

Published Mon, Aug 31 2020 2:14 AM | Last Updated on Mon, Aug 31 2020 7:53 AM

Average Income Indians Emong Those Settling In America Is Higher Than All - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్లోని పలువురు విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారులకు అమెరికా వెళ్లాలన్నది కల. దాన్ని నెరవేర్చుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ, వెళ్లిన వారిలో అంతా ఆర్థికంగా స్థితిమంతులు కాలేరు. భారతీయులు మాత్రం ఆదాయంలో ఎక్కడా తగ్గడం లేదు. వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉండటం.. వివిధ రంగాల్లో మనోళ్లకున్న ప్రతిభాపాటవాలకు నిదర్శనం. ఏటా అక్కడి  ప్రభుత్వం అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే నిర్వహిస్తుంది.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న స్థానికులు, విదేశీయుల మధ్యస్థ కుటుంబాల ఆదాయ వివరాలు నమోదుచేస్తుంది. అందులో వివిధ దేశాల నుంచి వచ్చినవారి గణాంకాలూ పొందురుస్తారు. ఈ వివరాల ప్రకారం.. అక్కడ స్థిరపడ్డ ఇండియన్‌ అమెరికన్ల ఆదాయం ఏటా అందరికంటే 1,00,500 డాలర్లుగా నమోదైంది. పొరుగు దేశాలైన శ్రీలంక.. నాలుగు, చైనా.. ఏడు, పాకిస్తాన్‌ .. ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొత్తం మీద టాప్‌ 10 దేశాల్లో తొమ్మిది ఆసియా దేశాలే కాగా.. స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలవడం విశేషం.

అమెరికాలో స్థిరపడిన వివిధ దేశాల మధ్యస్థ(మధ్య తరగతి) కుటుంబాల ఆదాయం ఏటా.. 
ఇండియన్‌    1,00,500
ఫిలిప్పో         83,300
తైవానీస్‌        82,500
శ్రీలంకన్‌        74,600
జపనీస్‌        72,300
మలేసియన్‌  70,300
చైనీస్‌           69,100
పాకిస్తాన్‌       66,200
వైట్‌–అమెరికన్లు        59,900
కొరియన్‌                    59,200
ఇండోనేసియన్‌         57,500
స్థానిక–అమెరికన్లు     56,200
థాయ్‌లాండ్‌             55,000
బంగ్లాదేశీ                 50,000
నేపాలీ                     43,500
లాటినో                   43,000
ఆఫ్రికన్‌ –అమెరికన్లు   35,000

భారతీయులు బుద్ధిమంతులే కాదు, విద్యావంతులు కూడా. అమెరికాలో స్థిరపడుతున్న విదేశీయుల్లో బ్యాచ్‌లర్‌ డిగ్రీ ఉన్న వారిలోనూ ఇండియన్లే నంబర్‌వన్. ఈ విషయంలో అమెరికన్లు 28 శాతంతో ఆఖరిస్థానంలో నిలవడం గమనార్హం.

ఇండియన్‌ – అమెరికన్లు    70 % 
కొరియన్‌ – అమెరికన్లు       53 % 
చైనీస్‌ – అమెరికన్లు            51 %
ఫిలిప్పో – అమెరికన్లు         47 % 
జపనీస్‌ – అమెరికన్లు         46 % 
సగటు అమెరికన్లు              28 %   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement