యూట్యూబ్‌తో ఎంత సంపాదించాడో తెలుసా? | ​World's Richest YouTuber Dan Middleton Makes Cool £12 Million | Sakshi
Sakshi News home page

రూ.170కోట్లు సంపాదించిన యువకుడు..

Published Sun, Dec 10 2017 6:28 PM | Last Updated on Sun, Dec 10 2017 9:38 PM

​World's Richest YouTuber Dan Middleton Makes Cool £12 Million - Sakshi

కొంతమంది ఆదాయం కోసం ఉద్యోగం చేస్తారు. మరికొందరు వ్యాపారం చేస్తారు. ఇలా తమకు ఏది అవకాశం ఉంటే దానిద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంటారు. టెక్నాలజీని వాడుకుని యువత సంపాదన కోసం సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. అలాంటి మార్గంలో ఓ బ్రిటిష్‌ యువకుడు యూట్యూబ్‌ ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించి వార్తలకెక్కాడు. అదికూడా ఎంతంటే ఏకంగా రూ.170 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే బ్రిటన్‌కు చెందిన గ్రాసరీ స్టోర్ టెస్కోలో చాలా కాలం పాటు పనిచేసిన డాన్‌ మిడిల్టన్ అనే యువకుడు ఉద్యోగానికి రాజీనామా చేసి, టీడీఎం పేరిట యూట్యూబ్ లో ఓ ఛానెల్‌ను ఏర్పాటు చేశాడు. ఈఛానెల్‌లో వీడియో గేమ్‌లను ఎలా ఆడాలి, కొత్త గేమ్‌లపై రివ్యూలు, వాటికి సంబంధించిన సలహాలు అందించేవాడు. దీంతో మిడిల్టన్‌ ఛానెల్‌కు సుమారు 16 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లుగా చేరారు.

దీంతో ఇంత అతగాడి వీడియోలకు భారీ సంఖ్యలో హిట్స్‌ వచ్చేవి. అంతే గతేడాదికి గాను యూట్యూబ్‌ నుంచి ఏకంగా 16.5 మిలియన్ డాలర్లు (రూ.170 కోట్లు) సొమ్మును ఆర్జించాడు. ఈ సంపాదనతో మిడిల్టన్‌ ఫోర్బ్స్ పత్రికలో 'ద హయ్యెస్ట్ పెయిడ్ యూట్యూట్ స్టార్-2017' గా రికార్డులకెక్కాడు. మొత్తం టాప్ టెన్ యూట్యూబ్ స్టార్‌లు కలిసి మొత్తం రూ.188 కోట్లు సంపాదించగా.. అందులో డాన్ వాటానే రూ.170 కోట్లు.  మిగిలిన 9 మంది కలిసి సంపాదించిన మొత్తం కేవలం రూ. 10 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement