రిలయన్స్ ఇన్‌ఫ్రా లాభం రూ. 621 కోట్లు
ముంబై: రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 621 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 721 కోట్లతో పోలిస్తే ఇది 24% క్షీణత. ఇదే కాలంలో ఆదాయం కూడా 24% తగ్గి రూ. 4,708 కోట్లకు పరిమితమైంది. ఆదాయంలో ఈపీసీ విభాగం నుంచి రూ. 883 కోట్లు మాత్రమే లభించాయని, గతంలో రూ. 2,267 కోట్లను సాధించామని కంపెనీ సీఈవో లలిత్ జలాన్ చెప్పారు.
ఇక ఇతర ఆదాయం రెట్టింపై రూ. 328 కోట్లను తాకినప్పటికీ, రూ. 51 కోట్లమేర ఫారె క్స్ నష్టాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కాగా, పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 1,914 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం 15% తగ్గి రూ. 19,034 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు 17% జంప్‌చేసి రూ. 732 వద్ద ముగిసింది.