జియో యూజర్లకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పేశారు. జియో సిమ్పై అందిస్తున్న ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నేడు జరిగిన వాటాదారుల సమావేశంలో ఈ ప్రకటనను వెలువరిచారు. ఫేస్బుక్, స్వైప్ కంటే వేగంగా జియో సేవలు దేశంలో విస్తరించాయని ముఖేష్ అంబానీ హర్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం జియో సిమ్ను 5 కోట్ల మంది వాడుతున్నారని, నెంబర్ పోర్టబులిటీ స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సిమ్ సౌలభ్యం తీసుకొస్తామన్నారు.
Published Thu, Dec 1 2016 3:20 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement