హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ పరిశ్రమ 2024 మార్చి నెలలో మెరుగైన ప్రతిభ కనబరిచింది. ఫిబ్రవరితో పోలిస్తే గత నెల 9.5 శాతం వృద్ధి నమోదు చేసింది. అన్ని ప్రధాన చికిత్సా విభాగాల్లో అమ్మకాల విలువ పెరగడం ఈ జోరుకు కారణం అని మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఫార్మాట్రాక్ తెలిపింది. 2023–24లో భారతీయ ఔషధ పరిశ్రమ 6.5 శాతం వృద్ధితో రూ.1.98 లక్షల కోట్లు నమోదు చేసిందని వెల్లడించింది.
‘శ్వాసకోశ మినహా దాదాపు అన్ని చికిత్సలకు సంబంధించిన ఉత్పత్తుల విక్రయాల్లో సానుకూల విలువ పెరుగుదలను చూపించాయి. ధరల వృద్ధి శాతం సానుకూలంగా కొనసాగింది. అయితే మార్చి నెలలో పరిమాణంలో వృద్ధి శాతం చాలా తక్కువగా ఉంది. గత నెలలో కార్డియాక్ 15 శాతం, యాంటీ–ఇన్ఫెక్టివ్స్ 9, గ్యాస్ట్రో–ఇంటెస్టినల్ 9 శాతం విలువ వృద్ధి సాధించాయి. అమ్మకాల్లో ఈ మూడు విభాగాలే ఏకంగా 37.5 శాతం కైవసం చేసుకున్నాయి. విక్రయాల విలువ పరంగా యాంటీ డయాబెటిక్ 12.4 శాతం, విటమిన్స్, మినరల్స్, న్యూట్రాస్యూటికల్స్ 7.2 శాతం దూసుకెళ్లాయి’ అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment