ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) ఖాతాలకు ఆధార్ అనుసంధానికి ప్రభుత్వం కల్పించిన గడువును మరోసారి పొడిగించింది.
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) ఖాతాలకు ఆధార్ అనుసంధానికి ప్రభుత్వం కల్పించిన గడువును మరోసారి పొడిగించింది. 2017 మార్చి 31వ తేదీనాటికి పీఎఫ్ చందాదారులు, పింఛన్ దారులు ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాలని ఈపీఎఫ్‌వో తెలిపింది. పీఎఫ్ పథకాల ప్రయోజనాలు పొందాలంటే పీఎఫ్ చందాదారులు, పింఛనుదారులకు ఆధార్ తప్పనిసరి అని సష్టం చేసింది. సుమారు నాలుగు కోట్ల మంది ఈ వివరాలను అందించాలని కోరింది.
గతంలో జనవరి 31, అనంతరం ఫిబ్రవరి 28 వరకు విధించిన గడువును ఖాతాదారులు మరియు ఫించన్ దారుల సౌలభ్యం మరోసారి పొడిగించింది. తమ ఆధార్ నంబర్‌ను, లేదా ఆధార్ కోసం దరఖాస్తు చేసిన పత్రాన్ని తమకు సమర్పించాలని తెలిపింది.