న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) పథకాల ప్రయోజనాలు పొందాలంటే పీఎఫ్ చందాదారులు, పింఛనుదారులకు ఆధార్ తప్పనిసరి అని ఆ సంస్థ తెలిపింది. ఈ నెల 31కల్లా వారు తమ ఆధార్ నంబర్‌ను, అది లేకుంటే ఆధార్ కోసం దరఖాస్తు చేసిన పత్రాన్ని తమకు సమర్పించాలని ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జ్యోతి వెల్లడించారు. ఈ నెలాఖర్లో సమీక్ష ఉంటుందని, గడువును పొడించే అవకాశముందని అన్నారు. 2017 జనవరి 31కల్లా పీఎఫ్ చందాదారులు, పింఛన్ దారులు ఆధార్ సమర్పించాలని కార్మిక శాఖ కూడా ఓ ప్రకటనలో తెలిపింది.