జియో యూజర్లకు గుడ్న్యూస్ చెప్పేశారు! | New RelJio users from Dec 4 will get data, voice, video free till March 31: Mukesh Ambani | Sakshi
Sakshi News home page

జియో యూజర్లకు గుడ్న్యూస్ చెప్పేశారు!

Published Thu, Dec 1 2016 2:14 PM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM

జియో యూజర్లకు గుడ్న్యూస్ చెప్పేశారు! - Sakshi

జియో యూజర్లకు గుడ్న్యూస్ చెప్పేశారు!

జియో యూజర్లకు రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ గుడ్ న్యూస్ చెప్పేశారు. జియో సిమ్పై అందిస్తు‍న్న ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నేడు జరిగిన వాటాదారుల సమావేశంలో ఈ ప్రకటనను వెలువరిచారు. ఫేస్బుక్, స్వైప్ కంటే వేగంగా జియో సేవలు దేశంలో విస్తరించాయని ముఖేష్ అంబానీ హర్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం జియో సిమ్ను 5 కోట్ల మంది వాడుతున్నారని, నెంబర్ పోర్టబులిటీ స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సిమ్ సౌలభ్యం తీసుకొస్తామన్నారు.
 
కాగిత రహిత సమాజం కోసం జియోను తీసుకొచ్చాం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ జియో ఉచిత సేవలను పొడిగిస్తామని చెప్పారు. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద ఈ ఉచిత సేవలు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. జియో వినియోగదారులకు మిగతా నెట్వర్క్లు సహకరించడం లేదని ముఖేష్ అంబానీ ఆరోపించారు. సంచలమైన ఆఫర్లతో సెప్టెంబర్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో ఉచిత 4జీ డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులతో పాటు ఇతరాత్ర ఉచిత సేవలు డిసెంబర్ 3తో ముగియనున్న సంగతి తెలిసిందే. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు అంటే వచ్చే ఏడాది మార్చి 31వరకు జియో అందిస్తున్న సేవలన్నింటిన్నీ ఉచితంగా వాడుకోవచ్చని ముఖేష్ అంబానీ గురువారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement