
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. సప్తమి పర్వదినం సందర్భంగా మార్చి 8వ తేదీన (గురువారం) ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో బడ్జెట్ సమర్పిస్తారు.