
(ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించనున్నారు. వేతన సవరణను డిమాండ్ చేస్తూ యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు (యుఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో బ్యాంకర్లు ఈ సమ్మెకు దిగనున్నారు.
భారత బ్యాంకింగ్ రంగంలోని తొమ్మిది యూనియన్లు మార్చి 15 వ తేదీన సమ్మె చేసేందుకు నిర్ణయించామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం చెప్పారు. నవంబర్ 2017 నాటి పే రివిజన్ పెండింగ్‌లో ఉందని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోరాటానికి దిగనున్నామని చెప్పారు. అలాగే యూనియన్ ఆధ్వర్యంలో ఇతర నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్టు వెల్లడించారు. మంగళవారం ముంబయిలో జరిగిన యుఎఫ్‌బీయూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment