చై- శోభితల పెళ్లి ఎప్పుడంటే? | Naga Chaitanya, Sobhita Dhulipala To Marry In Rajasthan In March 2025 | Sakshi
Sakshi News home page

చై- శోభితల పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌?!

Published Thu, Aug 22 2024 1:33 AM | Last Updated on Thu, Aug 22 2024 1:42 PM

Naga Chaitanya, Sobhita Dhulipala To Marry In Rajasthan In March 2025

హీరో నాగచైతన్య, హీరోయిన్‌ శోభితా ధూళిపాళ్లల నిశ్చితార్థం ఈ నెల 8న జరిగిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ వీరి వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే చర్చ ఆరంభమైంది. కాగా నాగచైతన్య, శోభితల వివాహం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మార్చిలో రాజస్థాన్‌లో జరిగే అవకాశం ఉందనే టాక్‌ ప్రచారంలోకి వచ్చింది. 

ఈ ఇద్దరి సినిమా కాల్షీట్స్, వీరి కుటుంబంలోని ముఖ్య సభ్యులు అందుబాటులో ఉండే సమయం వంటి అంశాలు చర్చించుకుని పెళ్లి తేదీ, వివాహ వేదికపై ఇద్దరి కుటుంబ సభ్యులు ఓ స్పష్టతకు వస్తారట. మరి... ఈ ఏడాది చివర్లో నాగచైతన్యతో శోభిత ఏడడుగులు వేస్తారా? లేక వచ్చే ఏడాది మార్చిలో శోభిత మెడలో చైతన్య మూడు ముళ్లు వేస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement