
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర
ఎమ్మెల్యే కోమటిరెడ్డి
కనగల్: త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్ర నిర్వహించి కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తా మని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని, టీఆర్ ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తా మన్నారు. నల్లగొండ జిల్లా కనగల్ వైస్ ఎంపీపీ పీఠాన్ని ‘హస్త’గతం చేసుకున్న సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు.
సొంత గ్రామంలో సర్పంచ్‌ను గెలిపించుకోలేని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండలో సీఎం కేసీఆర్‌ను గెలిపిస్తామనడం హాస్యా స్పదంగా ఉందన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీ చేస్తే ఓడిస్తామన్నారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు తదితర హామీలకు టీఆర్‌ఎస్ నేతలు మంగళం పాడుతున్నా రని విమర్శించారు. ఆయన వెంట నకిరే కల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు ఉన్నారు.