
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తరహా ‘బంగారు తెలంగాణ’ అనే మాటలు తాము చెప్పమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy). ఈరోజు(మంగళవారం) సాక్షి టీవీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు.
‘నాల్గో తేదీన క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది. సంక్రాంతికి రైతు భరోసా(Rythu Bharosa)నిధులు రైతులకు అందిస్తున్నాం,
రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇప్పటికే చేయాల్సింది చాలా చేశాం. రాబోయే ఐదేళ్లు మరింత కష్టపడి పనిచేస్తాం. ఆరువేల కోట్ల రూపాయలు పెట్టి ఔటర్ రింగ్ రోడ్డు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కడితే.. ఏడు వేల కోట్లకు కేసీఆర్ అమ్ముకున్నాడు. డ్రగ్స్ నిర్మూలన కోసం సాక్షి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి అభినందనలు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.