మార్చిలో తగ్గిన ధరల వేగం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో ఫిబ్రవరితో పోలిస్తే తగ్గింది. 2017 ఫిబ్రవరిలో 6.55 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం (2016 ఫిబ్రవరి టోకు ధరల బాస్కెట్‌తో పోల్చితే) 2017 మార్చిలో 5.7 శాతానికి తగ్గింది. 2016 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం అసలు పెరక్కపోగా –0.45 క్షీణతలో ఉంది.
ప్రధాన విభాగాలను వేర్వేరుగా చూస్తే...
పైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 4.63 శాతంగా ఉంది. ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 3.12 శాతంగా ఉంది. నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం 4.91 శాతంగా ఉంది. సూచీలో ఈ విభాగం వెయిటేజ్ దాదాపు 20 శాతం. ఆహార విభాగంలో కూరగాయల ధరలు 5.70 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 7.62 శాతం ఎగశాయి. గుడ్లు, మాంసం, చేపలు 3.12 శాతం పెరిగాయి.
► ఫ్యూయెల్ అండ్ పవర్: మార్చిలో ద్రవ్యోల్బణం 18.16 శాతంగా ఉంది. సూచీలో ఈ విభాగం వెయిటేజ్ 20 శాతం. ఫిబ్రవరిలో ఈ రేటు 21.02 శాతం.
► తయారీ: సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 2.99 శాతంగా ఉంది. మార్చిలో ఈ రేటు 3.66 శాతంగా ఉంది.