స్ట్రీట్ అంచనాలను బద్దలు కొట్టిన రిలయన్స్
స్ట్రీట్ అంచనాలను బద్దలు కొట్టిన రిలయన్స్
Published Mon, Apr 24 2017 6:04 PM | Last Updated on Mon, Oct 8 2018 7:36 PM
న్యూఢిల్లీ : ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాల్లో హవా చాటుతున్న రిలయన్స్ ఇంటస్ట్రీస్, స్ట్రీట్ అంచనాలు మరోసారి అంచనాలను బద్దలు కొట్టింది. ఏడాది ఏడాదికి కంపెనీ కన్సాలిడేట్ నికర లాభాలను 11.54 శాతం పెంచుకుంది. మార్చితో ముగిసిన క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.8,055కోట్లగా నమోదైనట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభాలు రూ.7,220 కోట్లగానే ఉన్నాయి. ఏడాది ఏడాదికి కంపెనీ లాభాల వృద్ధి నమోదుచేయడం ఇది వరుసగా తొమ్మిది క్వార్టర్. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు కూడా కంపెనీకి ఒక్కో బ్యారెల్కు 11.5 డాలర్లగా ఉన్నాయి. ఈటీ నౌ అంచనాల ప్రకారం ఇవి 10.4 డాలర్లే ఉంటాయని తెలిసింది. స్టాండలోన్ మార్జిన్లు కూడా కంపెనీకి 17 శాతం పెరిగినట్టు వెల్లడైంది.
నిర్వహణల నుంచి వచ్చిన రెవెన్యూలు ఈ క్వార్టర్ లో 12 శాతం పెరిగి రూ.74,598 కోట్లగా నమోదైనట్టు ప్రకటించింది. గత క్వార్టర్ లో ఇది రూ.66,606 కోట్లగానే ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈబీఐటీడీఏలు ఏడాది ఏడాదికి 17 శాతం పెరిగి, 12,416 కోట్లగా రికార్డైనట్టు వెల్లడించింది. సీఎన్బీసీ-టీవీ18 అంచనాల ప్రకారం కంపెనీ లాభాలు 8000 కోట్లగా, నిర్వహణ లాభాలు 11,485 కోట్లగా నమోదవుతాయని తెలిసింది. కానీ వారి అంచనాలను రిలయన్స్ బద్దలుకొట్టింది.
వచ్చే నెలల్లో జియో నెట్ వర్క్ కోసం లక్ష టవర్లను ఏర్పాటుచేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. మార్చితో ముగిసిన క్వార్టర్కు జియో సబ్ స్క్రైబర్ బేస్ 108.9 మిలియన్లను తాకినట్టు కూడా కంపెనీ వెల్లడించింది. మరోవైపు స్టాక్ విలువ 1.19 శాతం పెరిగి, 4.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ అవతరించింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ ను ఇది అధిగమించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం మార్కెట్ల ముగింపుకు 4.58 లక్షల కోట్లగా ఉంది.
Advertisement