
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మార్చి మొదటి వారంలో భారీ బహిరంగసభ నిర్వహణకు బీజేపీ కసరత్తు చేస్తోంది. సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సభ నిర్వహణపై పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కసరత్తు చేస్తున్నారు.
బీజేపీకి దూరంగా రఘునందన్‌రావు: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడు రఘునందన్‌రావును పార్టీ దూరంగా పెట్టినట్లు తెలిసింది. కేసు తేలేవరకు పార్టీకి దూరంగా ఉండాలని స్పష్టం చేసినట్లు సమాచారం.
కేకే ఆంధ్రప్రదేశ్ ఎంపీనే..: తుక్కుగూడ మున్సిప ల్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ కె.కేశవరా వు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడేనని రాజ్యసభ అండర్ సెక్రెటరీ దీపక్ కల్రా స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ఆయన లేఖ రాశారు.