3 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
18 పనిదినాలకే పరిమితం
ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వకూడదనే
ఉద్దేశంలో ప్రభుత్వం
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18) బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోజున ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. మార్చి 8వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలను కేవలం 18 పనిదినాలకే పరిమితం చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రారంభమై మార్చి నెలాఖరు వరకు జరుగుతాయి. అయితే ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించడానికి, చర్చించడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే ప్రభుత్వం వీలైనన్ని తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని అధికార పార్టీకి చెందిన నేతలే పేర్కొంటున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే అంశంపై పలు ఆందోళనలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో విశాఖ బీచ్‌లో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునివ్వడమే కాకుండా ఆయనే స్వయంగా ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్టణం వస్తే విమానాశ్రయంలోనే పోలీసుల చేత ప్రభుత్వ పెద్దలు నిర్భంధించిన సంగతి తెలిసిందే.
మార్చి 8న రాష్ట్ర బడ్జెట్
Published Fri, Feb 3 2017 2:19 AM | Last Updated on Mon, Oct 8 2018 7:36 PM
Advertisement
Advertisement