వాషింగ్టన్: అమెరికాలో గురువారం కొత్త కాంగ్రెస్ కొలువుతీరింది. రిపబ్లికన్ పార్టీ నేత అధ్యక్షుడిగా ఉండగా, ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న వింత పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది. మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌నకు ఈ పరిస్థితి సవాలుగా నిలవనుంది. 435 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 235 మంది డెమొక్రాట్లు, 199 మంది రిపబ్లికన్లు సభ్యులుగా ఉన్నారు. ఒక సీటుపై వివాదం నెలకొని ఉంది. సెనెట్‌లోని కొత్త సభ్యులతో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. సెనెట్‌లో రిపబ్లికన్ల ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం 100 సభ్యులకు గానూ 53 మంది రిపబ్లికన్లు, 45 మంది డెమొక్రాట్లు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు డెమొక్రాట్లకు మద్దతిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment