pelosi
-
ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల ఆధిక్యం
వాషింగ్టన్: అమెరికాలో గురువారం కొత్త కాంగ్రెస్ కొలువుతీరింది. రిపబ్లికన్ పార్టీ నేత అధ్యక్షుడిగా ఉండగా, ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న వింత పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది. మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌నకు ఈ పరిస్థితి సవాలుగా నిలవనుంది. 435 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 235 మంది డెమొక్రాట్లు, 199 మంది రిపబ్లికన్లు సభ్యులుగా ఉన్నారు. ఒక సీటుపై వివాదం నెలకొని ఉంది. సెనెట్‌లోని కొత్త సభ్యులతో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. సెనెట్‌లో రిపబ్లికన్ల ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం 100 సభ్యులకు గానూ 53 మంది రిపబ్లికన్లు, 45 మంది డెమొక్రాట్లు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు డెమొక్రాట్లకు మద్దతిస్తున్నారు. -
పచ్చని తీరం
అలుపెరగని అలల నురగలతో సుందరంగా ఉండాల్సిన బీచ్ ఆకుపచ్చగా మారిపోయింది. తూర్పు చైనా జింగ్ డావో ప్రావిన్స్‌లోని ఓ బీచ్ నాచుమయంగా మారింది. అలలతో పాటు ఒడ్డుకు కొట్టుకొచ్చే నాచుతో ఆ ప్రాంతమంతా ఆకుపచ్చ రంగుతో నిండుకుని కంటికి ఇంపుగా కనిపిస్తోంది. సాధారణ నాచు అంటే దుర్వాసన వెదజల్లుతూ అటువైపు వెళ్లాలంటేనే చిరాకు కలిగిస్తుంది. కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న నాచు మాత్రం సువాసన వెదజల్లుతూ స్థానికులను ఆకర్షిస్తోంది. ఈ నాచు తీరాన్ని చూసేందుకు ప్రస్తుతం చైనీయులు ఎగబడుతున్నారు. మరీ ముఖ్యంగా వీకెండ్స్‌లో అమ్మాయిల తాకిడి ఎక్కువగా ఉంటోంది. పచ్చ సముద్రం (ఎల్లో సీ) నుంచి భారీగా కొట్టుకొచ్చే నాచు ఇప్పుడు దాదాపు 9 వేల హెక్టార్లు పేరుకుపోయిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీనిని శుభ్రం చేద్దామనుకునేలోగా పర్యాటకుల సంఖ్య పెరిగిందని దీంతో నాచు తొలగింపు పనులను నిలిపేసినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.