కరోనా నివారణకు రూ.1500 లక్షల కోట్లు | CoronaVirus: US Senate Passes Relief Package | Sakshi
Sakshi News home page

కరోనా నివారణకు రూ.1500 లక్షల కోట్లు

Published Thu, Mar 26 2020 7:54 PM | Last Updated on Thu, Mar 26 2020 9:13 PM

CoronaVirus: US Senate Passes Relief Package - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌ వైరస్‌ విజృంభణతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు  రెండు లక్షల ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు 1500 లక్షల కోట్ల రూపాయలు) ప్రతిపాదించిన ప్రత్యేక బిల్లుకు ఆమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది. సమగ్ర చర్చ అనంతరం 96–0 మెజారిటీతో బుధవారం సాయంత్రం సెనేట్‌ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు శుక్రవారం నాడు ప్రజా ప్రతినిధుల సభ ఆమోదానికి రానుంది. ఆ సభ అనంతరం దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంతకంతో బిల్లు ఆమోదంలోకి వస్తోంది. 

కరోనా నివారణ చర్యలతోపాటు ఆస్పత్రుల నిర్మాణానికి, బాధితులను ఆదుకోవడానికి ఈ నిధులను ఖర్చు పెడతారు. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం చేయడంతోపాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భతి అందిస్తారు. సష్టపోయిన పేదలు, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవడంతోపాటు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. కాగా, అతిపెద్ద జనాభా గల దేశమైన భారత్‌లో కరోనా వైరస్‌ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు  రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement