ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన పాకిస్తాన్‌లో రాజకీయ అనిశ్చితి మరింత ముదురుతోంది. అతి శీతల వాతావరణ పరిస్థితులు, ఖైబర్ ఫంక్తున్వా వంటి ప్రావిన్సుల్లో భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఫిబ్రవరి 8వ తేదీన జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సెనేట్ తీర్మానం ఆమోదించింది.
స్వతంత్ర సభ్యుడు దిలావర్ ఖాన్ చేసిన ప్రతిపాదనకు ఊహించని మద్దతు లభించింది. అయితే, పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) సెనేట్ తీర్మానాన్ని తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు ద్వారా మాత్రమే ఎన్నికల షెడ్యూల్ మారుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment