ఇటీవల అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో అమెరికా ఉపాధ్యక్ష పదవిలో భారత మూలాలున్న కమలా హారిస్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత సంతతికి చెందిన రెజనీ రవీంద్రన్ అనే కళాశాల విద్యార్ధిని విస్కాన్సిన్ నుంచి సెనేట్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించింది. డెమొక్రాటిక్ సెనేటర్ టామీ బాల్డ్‌విన్‌పై అధికారికంగా పోటీ చేసిన ఆమె.. మొదటి రిపబ్లికన్‌గా చరిత్ర సృష్టించారు.
ప్రైమరీకి ఇంకా ఏడాది మాత్రమే సమయం వున్నట్లు మిల్వాకీ జర్నల్ సెంటినెల్ పేర్కొంది. ఈ సందర్భంగా రెజనీ మాట్లాడుతూ. . "నేను చాలా మంది రాజకీయ నాయకులు, లాబీయిస్టులు, పాలసీ మేకర్స్‌ను కలిశాను. వారిలో చాలా మంది 20, 30 సంవత్సరాలుగా ఉన్నారు. మనమే వారిని ఎన్నుకుంటున్నాం, అధికారాన్ని ఇస్తున్నాం. అయితే వారు మాత్రం వాష్టింగ్టన్ డీసీలో సుఖంగా ఉంటున్నారని చురకలంటించారు. మన గురించి మరిచిపోయినప్పుడు, వారిని అక్కడికి పంపడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. రవీంద్రన్ రాజకీయాలకి కొత్త. ఆమె ఈ సంవత్సరం స్టీవెన్స్ పాయింట్ కాలేజ్ రిపబ్లికన్‌లలో చేరింది.
ఈ వేసవి ప్రారంభంలో వాషింగ్టన్ పర్యటన తర్వాత సెనేట్‌కు పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె వచ్చే ఏడాది పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయాలని యోచిస్తోంది. రవీంద్రన్ భారతదేశం నుంచి 2011లో యుఎస్‌కి వలస వెళ్లారు. ఆమె 2015లో అమెరికా పౌరసత్వం పొందింది. 2017లో విస్కాన్సిన్‌కు వెళ్లడానికి ముందు కాలిఫోర్నియాలో నివసించేది.
చదవండి చికాగో రోడ్లపై దయనీయస్థితిలో ఉన్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం
Comments
Please login to add a commentAdd a comment