వాషింగ్టన్: ఆసియన్ అమెరికన్లతోపాటు పసిఫిక్ ఐలాండర్స్‌పై పెరుగుతున్న విద్వేష పూరిత నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు సెనేట్ గురువారం ఆమోదముద్ర వేసింది. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో పెరిగిపోయిన ఇటువంటి ఘటన లను సెనేట్‌లోని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ముక్త కంఠంతో ఖండించారు.
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జనవరిలో కుదిరిన అంగీకారం ప్రకారం సెనేట్ ఈ బిల్లును 94–1 ఓట్ల తేడా తో ఆమోదించింది. తాజా పరిణామంతో విద్వేష నేరాల దర్యాప్తును వేగవంతం చేయడానికి వీలుపడుతుంది. కొద్ది వారాల్లో ఈ బిల్లు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు సమాన సంఖ్యలో ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు వెళ్లనుంది.
( చదవండి: అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా )
Comments
Please login to add a commentAdd a comment