15న కార్మికులకు సెలవు దినం | labour department declares holiday on january 15 | Sakshi
Sakshi News home page

15న కార్మికులకు సెలవు దినం

Published Wed, Jan 14 2015 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

labour department declares holiday on january 15

సాక్షి, హైదరాబాద్: ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1974 కింద ఏర్పాటైన పరిశ్రమలు, షాపులు తదితర ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ నెల 14కు బదులుగా 15ను సంక్రాంతి సెలవు దినంగా మార్చారని జంటనగరాల కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఇ.గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయా దుకాణాలు, పరిశ్రమల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి ఆ రోజును వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement