బ్యాడ్మింటన్‌లో ఆర్టీసీ కర్నూలు జట్టు రాష్ట్ర విజేత
కర్నూలు (రాజ్‌విహార్): కార్మిక శాఖ అధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ఆర్టీసీ కర్నూలు ఉద్యోగులు తమ ప్రతిభను కనబర్చారు. మేడే సందర్భంగా గత నెలలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఆర్టీసీ రీజియన్ క్రీడాకారులు ఆదోని డిపోలో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్న వెంకట్రావు, నందికొట్కూరు, డోన్ డిపోలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ప్రసాద్ రావు, భరణీ కుమార్‌లు జోనల్ స్థాయిలో విజేతగా నిలిచారు. వీరు ఏప్రిల్ 29, 30 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సెమీఫైనల్‌లో విశాఖపట్నం జట్టుపై విజయం సాధించగా ఫైనల్‌లో అద్దంకి డిపో జట్టుపై విజేతగా నిలిచారు. వీరికి కార్మిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన మేడే వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి పీతాని సత్యనారాయణ మెమొంటో, బహుమతులు ఇచ్చి అభినందించారు. వీరికి స్థానిక అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.