కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సెకండరీ గ్రేడు టీచర్లుగా పనిచేస్తూ స్కూల్ అసిసెంట్ల పదోన్నతులకు అర్హత సాధించిన ఉపాధ్యాయుల తాత్కాలిక జాబితాను డీఈఓ బ్లాగ్‌లో ఉంచినట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలోని టీచర్ల సీనియారిటీపై అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈనెల 5వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
డీసీఈబీ కాంట్రిబ్యూషన్ చెల్లింపు గడువు పొడిగింపు
అన్ని యాజమాన్యాల హైస్కూల్స్ విద్యార్థులకు సంబంధించి 2016–17 విద్యాసంవత్సరంలో పరీక్షల కాంట్రిబ్యూషన్ ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు డీసీఈబీ కార్యదర్శి ఓంకార్‌యాదవ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు డీసీఈబీ ఆన్‌లైన్ అకౌంట్‌లో ఫీజును చెల్లించవచ్చన్నారు.