ఎస్టీయూ సంబరాలు
కర్నూలు సిటీ: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో కత్తి నరసింహారెడ్డి గెలుపొందడంతో బుధవారం ఎస్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షన్మూర్తి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌రెడ్డి, తిమ్మన్న తదితరులు డీఈఓ తాహెరా సుల్తానాను కలిసి స్వీట్లు అందజేశారు. అనంతరం డీఈఓ కార్యాలయంలో ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై కత్తి నరసింహారెడ్డి చేసిన పోరాటాలే ఎన్నికల్లో గెలిపించాయన్నారు. ఎన్నిక హామీలు నెరవేర్చుకునేందుకు భవిష్యత్తు ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.