ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన అశోక్ బాబు | NGO leader ashok babu unsatisfied about AP government | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన అశోక్ బాబు

Published Sun, Feb 1 2015 1:45 PM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM

ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన అశోక్ బాబు - Sakshi

ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన అశోక్ బాబు

నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీఎన్జీఓ నేత అశోక్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన హెల్త్కార్డులను ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...  ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదల వ్యవహారంలో కూడా  పీఆర్సీపై ప్రభుత్వ స్పందన తీరు సరిగా లేదన్నారు.

రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని అశోక్ బాబు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా విజయవాడకు తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని ఈ సందర్బంగా అశోక్ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement