దేశంలో 2024లో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే ఎలక్షన్ ప్లాన్ షురూ చేసింది. దేశంలో బీజేపీ అధికారంలోలేని రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల్లో కొత్తగా బీజేపీ అధ్యక్షులను నియమించింది. ఆయా రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్ర యూనిట్లకు కొత్త చీఫ్‌ల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, లోక్‌సభ ఎంపీ సీపీ జోషి రాజస్థాన్ బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఇక, బీహార్‌కు సంజయ్ జైస్వాల్ స్థానంలో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడు సామ్రాట్ చౌదరిని రాష్ట్ర చీఫ్‌గా అధిష్టానం ఖరారు చేసింది.
కాగా, రాజస్థాన్‌లో జైపూర్‌లోని అంబర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్న సతీష్ పూనియా స్థానంలో సీపీ జోషికి అవకాశం ఇచ్చారు. మరోవైపు, బీజేపీ ఒడిశా యూనిట్ అధ్యక్షుడిగా మాజీ రాష్ట్ర మంత్రి మన్మోహన్ సమాల్ స్థానం దక్కించుకున్నారు.
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने राजस्थान में श्री सीपी जोशी, बिहार में श्री सम्राट चौधरी, ओड़िशा में श्री मनमोहन सामल और दिल्ली में श्री वीरेन्द्र सचदेवा को पार्टी का नया प्रदेश अध्यक्ष नियुक्त किया है। pic.twitter.com/l9AN7X8suM
— BJP (@BJP4India) March 23, 2023
Comments
Please login to add a commentAdd a comment