సాక్షి, చెన్నై: మరో వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల అవినీతి జాబితాను విడుదల చేయనున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. ఇది కాస్త ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. అలాగే, మంగళవారం చలో సచివాలయం నినాదంతో పాదయాత్రకు బీజేపీ నిర్ణయించింది. డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే.
ఈకాలంలో మంత్రి రాజకన్నప్పన్ శాఖలో మాత్రమే మార్పు జరిగింది. మరో మంత్రి శివ శంకర్‌కు రాజకన్నప్పన్ శాఖ బాధ్యతల్ని అప్పగించారు. ఈ పరిస్థితుల్లో గత వారం రోజులుగా జూన్‌లో మంత్రి వర్గంలో మార్పు ఉండొచ్చని, నలుగురు మంత్రుల పనితీరుపై సీఎం స్టాలిన్ అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఇద్దరు మంత్రుల అవినీతి జాబితా తమకు చిక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆదివారం ప్రకటించడం ఉత్కంఠ కలిగిస్తోంది.
ఆధారాలతో..
డీఎంకే ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేదని సీఎం స్టాలిన్ పేర్కొంటున్నారని, అయితే ఇద్దరు మంత్రుల అవినీతి జాబితా తమకు చిక్కిందని బీజేపీ అ«ధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. వారి అవినీతికి సంబంధించిన సమగ్ర వివరాలు, ఆధారాలను వారంలో బయట పెడుతామని స్పష్టం చేశారు. దీంతో ఆ మంత్రులు ఎవరు..? ఆ శాఖలు ఏమిటో..? అన్న చర్చ ప్రారంభమైంది. అదే సమయంలో కేంద్ర పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ సచివాలయం వైపుగా పాదయాత్రకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈనెల 31న వళ్లువర్ కోట్టం నుంచి ఉదయం 11 గంటలకు చలో సచివాలయం పయనం చేపట్టనున్నామని అన్నామలై ప్రకటించారు.
చదవండి: తల్లి గుండె బద్ధలైంది: హృదయ విదారకం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
Comments
Please login to add a commentAdd a comment