
బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా కిషన్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్‌ప్రకాశ్ నడ్డా ప్రకటించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తనవంతు కృషిచేస్తానని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శక్తివంచన లేకుండా పాటు పడతానని చెప్పారు. తెలంగాణ లో బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు.