న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసకందా యంలో పడ్డాయి. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నామంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన గవర్నర్ లాల్జీ టాండన్‌ని కలిసి ఓ లేఖ అందజేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నిర్బంధంలో ఉంచి బేరసారా లాడుతోందని ఆరోపించారు. ఈనెల 3, 4 తేదీల నుంచి 10వ తేదీ వరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో వివరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పడిందన్నారు. బెంగుళూరులో నిర్బంధంలో ఉంచిన 22 మంది ఎమ్మెల్యేలను విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌ని కోరినట్టు వెల్లడించారు. ఏ క్షణంలోనైనా విశ్వాస పరీక్ష జరగొచ్చని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కోరిన మేరకు జ్యోతిరా దిత్య సింధియాకు అనుకూ లంగా రాజీనామా సమర్పించిన 22 మందిలో ఆరుగురు మంత్రులను తొలగించినట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించిం ది. ఇదిలా ఉండగా, మంత్రులతో సహా శాసన సభ్యులు బెంగళూరులోని రిసార్ట్స్‌లో తాము బందీలుగా ఉంచామంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది.
భోపాల్ బయలుదేరిన ఆరుగురు మంత్రులు
తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేసేందుకు బెంగళూరు రిసార్టులో ఉన్న ఆరుగురు మంత్రులు భోపాల్ బయలుదేరారు. వీరి రాక సందర్భంగా భోపాల్, బెంగళూరు విమానాశ్రయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారంలోగా తన ముందు వ్యక్తిగతం గా హాజరవ్వాల్సిందిగా రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ శాసనసభ్యులకు స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
రాజ్యసభకు సింధియా నామినేషన్
కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment