
ఏదేమైనా చచ్చే వరకు తాను బీజేపీలో కొనసాగుతానని ఆయన స్సష్టం చేశారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికార పీఠాన్ని లాక్కోవడానికి బీజేపీ ఆపరేషన్ కమలం కుట్రకు తెరలేపిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హెచ్చరికలకు లొంగకపోవడంతోనే బంధవాఘర్‌లో ఉన్న తన రిసార్టును అక్రమ నిర్మాణం పేరిట కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా చచ్చే వరకు తాను బీజేపీలో కొనసాగుతానని ఆయన స్సష్టం చేశారు. గురువారం తనను ఎత్తుకెళ్తేందుకు కాంగ్రెస్ వర్గం ప్రయత్నించిందని, తనకు ప్రాణ భయం ఉందని ఎమ్మెల్యే ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చారు.
(చదవండి: ప్రభుత్వాన్ని కూలిస్తే ఎమ్మెల్యేకు రూ.45కోట్లు)
కాగా, అక్రమంగా రిసార్టు నిర్మాణం చేశారని పేర్కొంటూ కమల్‌నాథ్ ప్రభుత్వం బంధవాఘర్‌లో ఉన్న సంజయ్ పాఠక్ రిసార్టును శనివారం కూల్చివేసింది. ఇక రిసార్టు కూల్చివేతతో పాటు.. సంజయ్ కలిగి ఉన్న ఇనుప ఖనిజం లీజులను కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. విజయ్‌రాఘవ్‌ఘర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంజయ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంజయ్ 2014లో బీజేపీలో చేరారు. 2016లో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
(చదవండి: మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆపరేషన్ కమలం ?)
BJP MLA Sanjay Pathak: There is a lot of pressure on me. I am being asked to quit BJP&to join Congress party, if I don't do that then such actions will be taken against me&my family members. There's constant threat to my life. I will die but will never quit BJP. #MadhyaPradesh https://t.co/BOhUXrlLWe pic.twitter.com/EV3LoMrlcJ
— ANI (@ANI) March 7, 2020