వయనాద్ : మధ్య్రప్రదేశ్ మంత్రి, ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవిపై కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన ఐటెం వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ మంగళవారం స్పందించారు. ఉప ఎన్నికలకు ముందు కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ‘కమల్‌నాథ్ జీ మా పార్టీ వ్యక్తే అయినా ఆయన వాడిన పదజాలాన్ని తాను సహించనని, దాన్ని ప్రశంసించలేమ’ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయన ఎవరైనా కమల్ నాథ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. చదవండి : ‘సర్కార్ వారి దౌర్జన్యం’
దాబ్రాలో ఆదివారం ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కమల్ నాథ్ మాట్లాడుతూ ఇమర్తి దేవిని ఉద్దేశించి ఐటెం అని వ్యాఖ్యానించడం దుమారం రేపింది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే సాధారణ వ్యక్తి కాగా తన ప్రత్యర్థి మాత్రం ఓ ఐటెం అని కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. కమల్ నాథ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ సోమవారం మౌన దీక్ష చేపట్టారు. ఇక తన వ్యాఖ్యలపై వివాదం నెలకొనడంతో కమల్ నాథ్ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ అవమానించలేదని, పేరు గుర్తుకురాకపోవడంతో తన చేతిలో ఉన్న జాబితాలో ఉన్న విధంగా ఐటెం నెంబర్ వన్, టూ అని చదివానని, ఇది అవమానించడమా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment