భోపాల్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెణుకులు విసిరారు. క్రికెట్‌లో మహేంద్ర ధోనీ మాదిరిగానే దేశ రాజకీయాలకు ఉత్తమ ఫినిషర్ రాహుల్ అని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్ ప్రసంగించారు.
ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ అధికారం నేడు ఏవో రెండు మూడు చిన్న రాష్ట్రాలకు పరిమితం కావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు కారణాలను ఆయన వివరిస్తూ..క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్ ఎవరని ప్రశ్నించగా జనం ‘ధోనీ’అని సమాధానమిచ్చారు. భారత రాజకీయాల్లో బెస్ట్ ఫినిషర్ ఎవరని నన్ను ఎవరైనా అడిగితే రాహుల్ గాంధీ అనే బదులిస్తాను. ఎందుకంటే, ఆయన హయాంలోనే కీలక నేతలెందరో ఆ పార్టీని వీడారు’అంటూ రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment