Best Finisher
-
Lok sabha elections 2024: ఉత్తమ ఫినిషర్ రాహుల్: రాజ్‌నాథ్
భోపాల్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెణుకులు విసిరారు. క్రికెట్లో మహేంద్ర ధోనీ మాదిరిగానే దేశ రాజకీయాలకు ఉత్తమ ఫినిషర్ రాహుల్ అని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ అధికారం నేడు ఏవో రెండు మూడు చిన్న రాష్ట్రాలకు పరిమితం కావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు కారణాలను ఆయన వివరిస్తూ..క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ ఎవరని ప్రశ్నించగా జనం ‘ధోనీ’అని సమాధానమిచ్చారు. భారత రాజకీయాల్లో బెస్ట్ ఫినిషర్ ఎవరని నన్ను ఎవరైనా అడిగితే రాహుల్ గాంధీ అనే బదులిస్తాను. ఎందుకంటే, ఆయన హయాంలోనే కీలక నేతలెందరో ఆ పార్టీని వీడారు’అంటూ రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. -
‘మాకు ధోనిలాంటి ఫినిషర్ కావాలి’
మెల్బోర్న్: వన్డేలు, టి20ల్లో తమ జట్టుకు ఒక సరైన ఫినిషర్ అవసరం ఉందని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు. అందుకు భారత స్టార్ ఎమ్మెస్ ధోని తరహా ఆటగాడైతే సరిగ్గా సరిపోతాడని అతను అన్నాడు. ‘గతంలో ఆస్ట్రేలియా జట్టుకు మైకేల్ బెవాన్, మైక్ హస్సీలాంటి వారు మ్యాచ్‌ను ముగించే బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. ఇంగ్లండ్‌కు ఇప్పుడు బట్లర్ అలాంటి పని చేస్తున్నాడు. ఇక ఎమ్మెస్ ధోని అయితే ఈ విషయంలో మాస్టర్లాంటివాడు. ప్రపంచంలో ప్రతీ జట్టు ఇప్పుడు ఇలాంటి క్రికెటర్లను కోరుకుంటోంది’ అని లాంగర్ వ్యాఖ్యానించాడు. ఇక ఆస్ట్రేలియా జట్టులో ‘ఫినిషర్’గా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆటగాళ్లు పోటీ పడాలని కూడా కోచ్ సూచించాడు. గతంలో మార్కస్ స్టొయినిస్‌ను ఆసీస్ ప్రయత్నించినా అతను ఘోరంగా విఫలమయ్యాడు. -
'మాకు ధోని లాంటి ఫినిషర్ కావాలి'
సిడ్నీ : ఆసీస్ జట్టుకు పరిమిత ఓవర్లలో ఎంఎస్ ధోని లాంటి ఫినిషర్ ఉంటే బాగుంటుందని మాజీ ఆటగాడు, ప్రస్తుత ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. ఇప్పుడు జట్టు మేనేజ్మెంట్ ధోనీ లాంటి ఫినిషర్ కోసమే వెతుకుందని అభిప్రాయపడ్డాడు. 'గతంలో మా జట్టులో మైక్ హస్సీ, మైఖేల్ బెవాన్ వంటి ఫినిషర్లు ఉండేవారు. అయితే బెస్ట్ ఫినిషర్‌గా మాత్రం ధోనిని మించిన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పటికే ధోని ఎన్నోసార్లు అది రుజువు చేశాడు. ఉదాహరణకు 2011 ప్రపంచకప్ చూసుకుంటే మహీ నాలుగో స్థానంలో వచ్చి 90 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు కప్‌ను అందించాడు. ఇంగ్లండ్ క్రికెట్లోనూ జాస్ బట్లర్ మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా ప్రసుత్తం మా జట్టుకు కూడా ధోని లాంటి ఫినిషర్ అవసరం ఉంది. జట్టు ఇన్నింగ్స్‌లో ఐదు, ఆరు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు మంచి ఫినిషర్లు అయి ఉండాలి.. అందుకోసం అన్వేషిస్తున్నాం' అంటూ లాంగర్ పేర్కొన్నాడు. (పాకిస్తాన్లో ధోని ఫీవర్!) కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ ఆతిథ్య జట్టుకు క్లీన్‌స్వీప్‌తో సమర్పించేసుకుంది. కాగా సరైన ఫినిషర్ లేకనే జట్టు ఓటమి పాలయిందని పలువురు ఆసీస్ మాజీ క్రికెటర్లు తెలిపారు. అయితే ప్రొటీస్‌తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో మిచెల్ మార్ష్ ఆరవ స్థానంలో వచ్చి 32, 36 పరుగులు సాధించాడు. తాజాగా మార్చి 13 నుంచి కివీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసీస్ తరపున టెస్టు ఓపెనర్‌గా ప్రాతినిథ్యం వహించిన జస్టిన్ లాంగర్ 105 టెస్టుల్లో 7696 పరుగులు, 8 వన్డేల్లో 160 పరుగులు చేశాడు. కాగా మాథ్యూ హెడెన్‌తో కలిసి ఆసీస్‌కు టెస్టుల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు.(హోలీ శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా క్రికెటర్లు) -
'ప్రపంచంలో ధోనీయే బెస్ట్ ఫినిషర్'
న్యూఢిల్లీ: ప్రపంచంలో బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అని యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కితాబిచ్చాడు. ఆసియా కప్ విజయం తమలో మరింత ఆత్మవిశ్వాసం కలిగించిందని, టి-20 ప్రపంచ కప్‌లో విజయపరంపర కొనసాగిస్తామని విరాట్ ధీమా వ్యక్తం చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి ధోనీసేన కప్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గురించి కోహ్లీ మాట్లాడుతూ.. 'ఓపెనర్ శిఖర్ ధవన్ బాగా ఆడాడు. కావాల్సిన రన్‌రేట్‌కు తగినట్టుగా ఆడాలని చూశా. ధవన్ అవుటయ్యాక కాస్త ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ అద్భుతంగా ఆడాడు. కీలక సమయంలో తన సత్తాచాటాడు. ఈ మ్యాచ్ అద్భుతమైనది' అని అన్నాడు. ఫైనల్లో ధోనీ 6 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
ధోని కాదు కోహ్లి బెస్ట్ ఫినిషర్: గంభీర్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో బెస్ట్ ఫినిషర్ ఎవరంటే ఎంఎస్ ధోని పేరే చెబుతారు. కానీ తన దృష్టిలో బెస్ట్ ఫినిషర్ విరాట్ కోహ్లి అని ధోని కాదని ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. 'బెస్ట్ ఫినిషర్ ట్యాగ్ ధోనికి మీడియా ఇచ్చింది. నా దృష్టిలో కోహ్లి బెస్ట్ ఫినిషర్. ఓపెనర్ కూడా ఫిషనర్ గా చెప్పవచ్చు. 6 లేదా 7 స్థానంలో బ్యాటింగ్ దిగిన వాళ్లను మాత్రమే ఫినిషర్ అనాల్సిన అవసరం లేద'ని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో అన్నాడు. కచ్చితంగా ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో ధోని నిర్ణయించుకోవాలని సూచించాడు. కెప్టెన్ బాగా ఆడినంత మాత్రానా సరిపోదని జట్టు మొత్తంగా బాగా ఆడితేనే విజయం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. టి20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు యువరాజ్ సింగ్ ఫామ్ రావడం టీమిండియాకు సానుకూలాంశమని చెప్పాడు. 2013లో ఐపీఎల్ లో విరాట్ కోహ్లితో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ... మైదానంలో కామెంట్లను వ్యక్తిగతంగా తీసుకోనని అన్నాడు. మైదానంలో సీరియస్ గానే ఉంటానని, అవరసరమైతే మరోసారి గొడవకు సిద్ధమని ప్రకటించాడు. కెప్టెన్ దృఢంగా ఉంటనే టీమ్ కూడా గట్టిగా ఉంటుందని పేర్కొన్నాడు. -
నా నుదిటిపై ఏమైనా రాసి ఉందా!
* ప్రతీసారి గెలిపించడం సాధ్యం కాదు * ఫినిషింగ్‌పై ధోని వ్యాఖ్య సిడ్నీ: ధోని అంటే బెస్ట్ ఫినిషర్... చివర్లో ఎన్ని పరుగులు చేయాల్సి ఉన్నా, ఎంత రన్‌రేట్ అవసరమైనా అతను క్రీజ్‌లో ఉంటే చాలు గెలిపిస్తాడనే ధీమా అందరిది. కానీ ఇటీవలి కాలంలో అతను ఇలా ముగిస్తున్న మ్యాచ్‌లు పెద్దగా ఉండటం లేదు. నాలుగో వన్డేలో ఘోరంగా విఫలమైన అతను... సిడ్నీలో మ్యాచ్ ముగించకపోయినా, ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్‌తో పని సులువు చేశాడు. అయితే ఇదేమీ అంత తేలికైన విషయం కాదని, ప్రతీసారి అంచనాలు అందుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. ‘లోయర్ ఆర్డర్లో మ్యాచ్‌లు ముగించడం నా బాధ్యత కావచ్చు. దానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. అందరి లక్ష్యం గెలిపించడమే. కానీ ఆ స్థితిలో ఆడటం అంత సులువు కాదు. హిట్టింగ్‌కు ప్రయత్నించి సిక్సర్ పడితే వహ్వా అంటారు, అదే అవుటైతే ఆ షాట్ ఆడటం అవసరమా అంటారు. ధోని అక్కడున్నాడా... అయితే మ్యాచ్ గెలిచేశాం అనుకోవడం తప్పు. నేనే మ్యాచ్ ముగించాలని ఏమైనా నా నుదుటి మీద రాసి ఉందా. మంచి యార్కర్ పడితే సిక్స్ ఎలా కొడతాం. నేను హెలికాప్టర్ షాట్ కొట్టలేదని అడుగుతారు. అది బౌన్సర్ అయితే నేనెలా ఆడేది? పరిస్థితులను బట్టి ఆడతామే కానీ ఎప్పుడూ గెలిపించడం సాధ్యం కాదు’ అని ధోని కుండబద్దలు కొట్టాడు.